భారతీయ జనతా పార్టీ లోకసభ సభ్యురాలు (BJP Lok Sabha MP), కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) మేనకా గాంధీ (Maneka Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో చేసిన సబ్బులను (Soaps with donkey milk) ఉపయోగిస్తే ఆడవాళ్లు అందంగా కనిపిస్తారని (women’s beauty) వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) సుల్తాన్ పూర్ లో (Sulthanpur) జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేదని చెప్పారు. గాడిద పాలతో (Donkey’s milk soap) చేసిన సబ్బులు ఢిల్లీలో (New Delhi) ఒక్కొక్కటి రూ.500కు అమ్ముతున్నట్లు చెప్పారు. మనం మేక (Goat), గాడిద పాలతో (Donkey Milk) చేసిన సబ్బులను (Donkey’s milk soap) ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
కాశ్మీర్ లోని (Kashmir) లడక్ (Ladakh) ప్రాంతంలో ఉన్న ఓ వర్గం వాళ్లు గాడిద పాలతో సబ్బులు (Soaps with donkey milk) తయారు చేస్తారని, మీరు ఎన్నాళ్ల క్రితం గాడిదను (Donkey) చూశారని, చూసారా ఆ జంతువుల సంఖ్య తగ్గుతోందని (donkey numbers are decreasing) చెప్పారు. వాషర్ మెన్ (washermen) కూడా వాటిని వాడడం ఉపయోగించడం లేదన్నారు. లడక్ లో (Ladakh) ఉన్న ఓ కమ్యూనిటీ ప్రజలు గాడిద పాలతో సబ్బులు తయారు చేస్తున్నారని, ఆ సోప్లతో మహిళలు ఎప్పటికీ అందంగా కనిపించవచ్చు అన్నారు. చెట్లు అంతరిస్తున్నాయని, కట్టెలు కొనడం ఖరీదుగా మారుతోందని ఆవేదవ వ్యక్తం చేశారు. ఇందుకే దహన ఖర్చులు (Cremation) కూడా పెరిగాయన్నారు. స్మశాన వాటికల్లో (Cremation spendings) ఉపయోగించే కట్టెలకు ఇప్పుడు రూ.20 వేల ఖర్చు చేయవలసి వస్తుందన్నారు. అయితే వాటికి బదులు ఆవు పేడను వాడాలన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు తగ్గే అవకాశముందని చెప్పారు.