Manipur Riots:మణిపూర్‌లో (manipur) రిజర్వేషన్ల అంశం హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. గిరిజన, గిరిజనేతర గ్రూపుల మధ్య గొడవతో ఆ రాష్ట్రం అట్టుడుకుతుంది. మణిపూర్ (manipur) రాజధాని ఇంఫాల్, చురాచాంద్‌పుర్, కాంగ్‌పోక్సిలో ఘర్షణలు జరగగా.. కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ (internet) సేవలను నిలిపివేశారు. ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద 4 వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు.
మైతే కమ్యూనిటీని షెడ్యూల్ తెగలో (st) చేర్చే చర్యలను గిరిజన సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టడంతో ఆర్మీ, అసోం రైఫిల్ బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఆర్మీ మార్చ్ ప్లాగ్ నిర్వహించింది.
మణిపూర్‌లో (manipur) ఘర్షణలపై బాక్సర్ మేరీకోమ్ స్పందించారు. ‘తమ రాష్ట్రం మండిపోతుంది.. సాయం చేయాలి’ అని ప్రధాని మోడీ (modi), హోం మంత్రి అమిత్ షాను (amith shah) కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిపై సీఎం బీరేన్ సింగ్‌తో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా గమనిస్తోందని తెలిపారు.
ఏం జరిగిందంటే..?
షెడ్యూల్ తెగ స్టేటస్ కోసం గిరిజనేతర మైతే వర్గం డిమాండ్ చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ తర్బుంగాలో గిరిజన సంఘీభావ యాత్రకు పిలుపునిచ్చింది. ర్యాలీలో వేల మంది పాల్గొన్నారు. ఎస్టీ హోదా కోసం మైతే చేసిన డిమాండ్‌కు మణిపూర్ (manipur) వ్యాలీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులు నుంచి మద్దతు ఉంది. దీంతో గిరిజన (tribals) ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణకు దారితీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మైతే వర్గానికి చెందినవారు ఉంటారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజనులు అంటున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తే తమ పరిస్థితి ఏంటీ అని అడుగుతున్నారు. నిజానికి పర్వత ప్రాంతాల్లో నివసించేందుకు మైతే వర్గానికి అనుమతి లేదు.