వర్షాలతో అల్లాడుతున్నతెలంగాణ (Telangana) ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరట కల్పించే న్యూస్ చెప్పింది. వర్షాలు ఇక తగ్గుముఖం పట్టినట్లేనని హైదరాబాద్ వెదర్ కేంద్రం (Weather Center) డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నేటి ఉదయం బలహీనపడిందని, మరో అల్పపీడనం(low pressure)ఏర్పడితే తప్ప ఇక భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని ఆమె తెలిపారు. తెలంగాణలో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా నమోదయినట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో అసాధారణ భారీ వర్షాలు (Heavy rains) కురిశాయన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని, అయితే ఆగస్ట్ రెండో వారంలో, సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు. గురు, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అయితే ఆ తర్వాత మూడు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవన్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అల్లాడుతోంది.