Realme: రియల్‌మీ P సిరీస్‌లోని ఫోన్, ఫీచర్లు ఇవే!

చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ పి సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లలను లాంచ్ చేసింది. పి1 5జీ, పి1 ప్రో 5జీ పేరుతో రెండు ఫోన్లను తీసుకచ్చింది. మరి ఈ 5జీ ఫోన్ల ఫీచర్లేంటి? ధరెంత? విక్రయాలు ఎప్పటి నుంచి? అనే వివరాలు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 05:03 PM IST

Realme: రియల్‌మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.18,999గా పేర్కొంది. ఇక రియల్‌మీ పీ1 ప్రో సైతం రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.21,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఏప్రిల్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రెండింట్లోనూ ఒకలాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చూడండి:Samantha: నాగచైతన్యతో విడాకులకు కారణం ఈమెనా..? అసలు విషయం చెప్పిన సమంత

6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ ఫోన్లలో ఉంటుంది. పీ1లో డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ ఇచ్చారు. ప్రో మోడల్‌.. స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో వస్తోంది. వెనకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. ప్రో వెర్షన్‌లో 8 ఎంపీ పోర్ట్ట్రెయిట్‌ కెమెరా అదనంగా ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తోంది. రెండేళ్లపాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చూడండి: Rashmika Mandanna: ఈసారి శ్రీవల్లితో మామూలుగా ఉండదు!