బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు… పరిచయం అక్కర్లేని పేరు. మన బంగారు తల్లి. మన దేశానికి బంగారం, సిల్వర్, రజత పతకాలు సాధించి.. దేశ ప్రగతిని పెంచింది. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇలా దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న పీవీ సింధు ఇటీవల బుల్లితెర మీద సందడి చేసింది. తాజాగా.. అలీతో సరదాగా షోకి హాజరైన పీవీ సింధు… పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో పీవీ సింధు తన గేమ్ లైఫ్ మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బయట ఎంతో హుందాగా కనిపించే పీవీ సింధు ఇంట్లో మాత్రం అల్లరి పనులు చేస్తూ ఉంటుంది. సింధు కోసం ఆమె తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని వారి త్యాగాల వల్ల ఈరోజు తను ఈ స్థితిలో ఉందని సింధు వెల్లడించింది. ఈ షో లో అలీ సింధుకి ఎన్నో ప్రశ్నలు వేశారు.
ఈ క్రమంలో ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. సింధు స్పందిస్తూ ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అని సమధానం చెబుతుంది. కాని అలీ మాత్రం ఒక్కరి పేరు మాత్రమే చెప్పమనగా ప్రభాస్ పేరు చెబుతోంది. దీంతో అలీ ఇద్దరు సేమ్ హైట్ ఉంటారు కదా అందుకా అని అంటాడు.
ఇక మరొక సందర్భంలో అలీ సింధు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? అని అడగ్గా.. ఇప్పట్లో తనకి పెళ్లి ఆలోచన లేదని తన ఏకాగ్రత కేవలం 2024 ఒలంపిక్స్ గేమ్స్ పైనే ఉందని తెలిపింది. అంతే కాకుండా 2024 ఒలంపిక్స్ ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ లో నాకు మంచి స్నేహితులు మాత్రమే కాదు బంధువులు కూడా ఉన్నారు అని సింధు వెల్లడించింది. 2024 ఒలంపిక్స్ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని, తనకి నచ్చిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అయితే సినిమా వాళ్ళను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోనని వెల్లడించింది.