»Political Heat In Ap Ys Jagan Delhi Tour Once Again
మరోసారి Delhiకి జగన్.. రెండు వారాల్లో రెండోసారి.. BJPతో పొత్తు కోసమా?
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
రెండు వారాల్లో రెండోసారి.. అకస్మాత్తుగా దేశ రాజధాని న్యూఢిల్లీకి సీఎం జగన్ పయనమవుతున్నాడు. రెండు వారాల్లోనే రెండోసారి హస్తిన పర్యటనకు జగన్ వెళ్తుండడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్చి 16, 17వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లాడు. తాజాగా మార్చి 29న సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని తాడేపల్లి (Tadepalli) వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఏపీలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారడంతో జగన్ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఢిల్లీ పర్యటన (Delhi Tour)కు సిద్ధమవుతున్నాడు. మంగళవారం విశాఖపట్టణంలో జీ20 సదస్సుకు హాజరైన అనంతరం అక్కడి నుంచి రాత్రి తాడేపల్లికి చేరుకుంటారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారని సమాచారం. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం దేశ రాజధానిలో ఉండనున్నారు. గత పర్యటనలో ప్రధాని మోదీని జగన్ కలిశారు. అయితే కేంద్ర మంత్రులను కలవలేదు. వారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులు ఇచ్చేందుకు వెళ్తున్నారని ప్రాథమికంగా అందిన సమాచారం.
అయితే అకస్మాత్తు పర్యటన నేపథ్యంలో రాజకీయంగా ఈ పర్యటన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల్లో (MLC Elections) ఓడిపోవడం.. టీడీపీ (Telugu Desam Party) పుంజుకోవడంతో ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఆకస్మాత్తుగా (Suddenly) ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి విన్నవించేందుకు ఈ పర్యటన ఉంటుందని అధికారికంగా వెలువడుతున్న సమాచారం. కానీ సీఎం జగన్ ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది. ఎందుకంటే ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దర్యాప్తు సంస్థలు ఓ ముఖ్యమైన కేసు విషయంలో తనను ఇబ్బందులు పెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపైనే సీఎం జగన్ కేంద్ర పెద్దలకు విన్నవించనున్నట్లు తెలుస్తున్నది.