ASR: హుకుంపేటలో రోజు రోజుకు పెరుగుతున్న గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ ప్రకాష్ కు ఫిర్యాదు చేశారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని, పెసా చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా గిరిజనేతరులు అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
W.G: అత్తిలి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు అత్తిలి బస్టాండ్ సెంటర్ నుంచి భీమవరం రోడ్డు మట్టపర్తిగరువు ప్రాంతం వద్ద గురువారం ఆగి ఉన్న కారును బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: కందుకూరు పట్టణంలో జనార్దన్ స్వామి టెంపుల్, బృందావనం కాలనీలో ఒక కుక్క మొత్తం 10 మందిపై దాడి చేసింది. దీంతో వారంతా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీనిపై స్థానిక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కృష్ణా: తోట్లవల్లూరులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రిరాజుపాలెంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గురువారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 1,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
VZM: భోగాపురం పోలిపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం శ్రీముఖలింగం దర్శనం చేసుకొని విశాఖ వైపు వెళ్తున్న కారు రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి గాయలవ్వడంతో హాస్పిటల్‌కి తరలించారు. భోగాపుర సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అరేబియా సముద్రంలో కల్లోల వాతావరణ పరిస్థితుల కారణంగా ఓ నౌక మునిగిపోయింది. గుజరాత్‌లోని ముంద్రా నుంచి యెమెన్‌లోని సొకొత్రా ద్వీపానికి ఓ నౌక బయల్దేరింది. అయితే మార్గమధ్యంలో పశ్చిమ అరేబియా సముద్రంలో భీకర అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురైంది. ఐసీజీ డోర్నియర్ దాన్ని గుర్తించి.. అందులోని తొమ్మిది మంది భారతీయ సిబ్బందిని కోస్ట్‌గార్డ్ సురక్షితంగా కాపాడింది.
HYD: జవహర్‌నగర్ PS పరిధిలోని న్యూ భవాని కాలనీలో పూర్ణిమ (19) అనే యువతి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమైన శివరాత్రి నిఖిల్ (21)ను ఈ రోజు అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సైదయ్య తెలిపారు. సీఐ కథనం మేరకు.. ప్రేమ పేరుతో నిఖిల్ కొన్నేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆత్మహత్యకు చేసుకుందన్నారు.
ప్రకాశం: బేస్తవారిపేట మండలం పందిల్లపల్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ బస్సును ఢీకొనడంతో గిద్దలూరుకు చెందిన కృష్ణ అనే ఆకుకూరల అమ్మే వ్యక్తికి గాయాలు కాగా అతనిని ప్రైవేట్ అంబులెన్స్‌లో గిద్దలూరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యమం లొనే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KMM: బేతుపల్లి-తాళమాడ మార్గంలో ఉన్న మొగల్ బిర్యాని పాయింట్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడిలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం పి గన్నవరం నుంచి రావులపాలెం ప్రయాణికులతో వెళుతున్న ఆటోకు కుక్క అడ్డు రావడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు చెబుతున్నారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కోనసీమ: పి.గన్నవరం మండలం ఊడిమూడిలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం పి గన్నవరం నుంచి రావులపాలెం ప్రయాణికులతో వెళుతున్న ఆటోకు కుక్క అడ్డు రావడంతో ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు చెబుతున్నారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలో భారీ స్కామ్ బయటపడింది. సంభాజీనగర్‌లోని డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వచ్చే నిధులను కంప్యూటర్ ఆపరేటర్ హర్షల్ కుమార్ క్షీరసాగర్(23) దారి మళ్లించాడు. దాదాపు రూ.21కోట్లను వేరు వేరు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. ఆ డబ్బుతో ప్రియురాలికి 4 బీహెచ్‌కే ఫ్లాట్ కొనిచ్చి, విలాసవంతమైన కార్లను కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
AP: కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో దారుణం జరిగింది. రూ.300 కోసం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సతీష్, వెంకటేశ్వరరావు అనే వ్యక్తుల మధ్య రూ.300 కోసం వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సతీష్‌పై వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సతీష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పెద్దమ్మ తండాలో దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త దాడి చేయడంతో సంతోష (25) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.