HNK: ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని హౌజుజుర్గ్ గ్రామానికి చెందిన కమలాకర్(37)పరకాల డివిజన్లోని మిషన్ భగీరథలో పని చేస్తున్నారు. కాగా,ఇతడికి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కమలాకర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు.