క్రైం థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు లొకేష్ కనగరాజ్ ప్రస్తుతం “కూలీ” సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రాజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అనే సంగతి తెలిసిందే. ఇటీవల, నాగార్జున బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. నాగార్జున ఈ సినిమాలో సిమన్ అనే పాత్రను పోషిస్తున్నారు.
ఇటీవల, కూలీ సినిమాకి చెందిన కొన్ని సెకండ్ల షూట్ వీడియో ఇంటర్నెట్లో లీక్ అయి, వైరల్ గా మారింది. ఈ ఘటనపై దర్శకుడు లొకేష్ కనగరాజ్ తన X (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా స్పందించారు.
“ఒక రికార్డింగ్ కారణంగా, అనేక మంది వర్క్ చేసిన రెండు నెలల కష్టం నాశనం అయింది. అందరికీ వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను, ఇలాంటి ప్రాక్టీసులలో పాల్గొనకండి, ఎందుకంటే ఇవి మొత్తం అనుభవాన్ని కాలంక్రమంలో నాశనం చేస్తాయి. ధన్యవాదాలు,” అని ఆయన పేర్కొన్నారు.
“కూలీ” సినిమా వచ్చే సంవత్సరంలో విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది రాజినీకాంత్ 171వ సినిమా కావడం గమనించదగ్గ విషయం. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి లీక్ ల సమస్య ఇండస్ట్రీకి కొత్త కాదు, కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ , శంకర్ గేమ్ చేంజర్ పాత కూడా ఇలా లీకేజీల భారిన పడింది. ఇలాంటి వాటివల్ల యూనిట్ పడిన కష్టం మొత్తం వృధా అవడంతో పాటు ఫాన్స్ కి ఎక్సిట్మెంట్ ఇవ్వాలనే యూనిట్ కష్టం కూడా వృధా అవుతుంది