»Man Resign Job Too Much Time To Office Distance At Delhi
Resign job: జాబ్‌లో చేరిన మొదటి రోజే జాబ్ కు రిజైన్..కారణం తెలిస్తే షాక్ అవుతారు
ఓ వ్యక్తికి మంచి జీతంతో ఓ కంపెనీలో ఉద్యోగం(job) వచ్చింది. కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత తక్షణమే నియమించుకున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత తన జాబ్ కు రాజీనామా చేశాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్పొరేట్ ప్రపంచంలోని ఉద్యోగులు(employees) వారానికి ఐదు నుంచి ఆరు రోజుల పాటు 8-9 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఆఫీసుకు ఇంటి మధ్య ప్రయాణ సమయాన్ని కలిపితే ఫ్యామిలితో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో నివాసం ఉంటున్న ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్లి రావడానికి ఎక్కువ టైం పడుతుందని ఉద్యోగంలో చేరిన మొదటి రోజు జాబ్ కు రిజైన్ చేశాడు. ఢీల్లీ ట్రాఫిక్‌లో ఆఫీసుకు వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతుందని ఆతను చెబుతున్నాడు.
తాను ఢిల్లీ(delhi) వాయువ్య ప్రాంతంలో (పింక్ లైన్) నివసిస్తున్నానని పేర్కొన్నాడు. ఉద్యోగం “మౌల్సారి అవెన్యూ”లో ఉంది. ఆ క్రమంలో తాను ఉద్యోగానికి వెళ్లి వచ్చిన తర్వాత ఇంట్లో కేవలం 3 గంటలు (7 గంటలు నిద్ర. మొత్తం 10 గంటలు) మాత్రమే ఉంటున్నాని గ్రహించినట్లు వెల్లడించాడు. దీంతోపాటు నెలవారీగా ప్రయాణానికి దాదాపు రూ.5 వేలు ఖర్చు అవుతుందని అన్నారు. ఆ క్రమంలో తాను ఇల్లు మార్చలేనని పేర్కొన్నారు. ఆ నేపథ్యంలోనే తన ఇంటికి సమీపంలో చాలా కంపెనీలు ఉన్నాయని వాటిలో జాబ్ వెతుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకే జాబ్ మానేస్తున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఇది అనేక మంది ఉద్యోగులకు ఇది వర్తించడంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారింది. అంతేకాదు ఇది చూసిన పలువురు అవును బ్రో మేము కూడా చాలా దూరం ఉందని పలు జాబ్స్ మానేసి నట్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.