Mahesh-Rajamouli : ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ఫిల్మ్ కావడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలె ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న ఫిల్మ్ కావడంతో.. ఎస్ఎస్ఎంబీ 28 అదిరిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతున్నాడు. ఈ మూవీతో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వస్తామని అంటున్నాడు. ఈ నేపథ్యంలో.. రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. త్రివిక్రమ్ సినిమా అలా అయిపోతే చాలు.. వెంటనే జక్కన్నతో రెండు, మూడేళ్లు ట్రావెల్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజిగా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవనుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ లేటెస్ట్ అప్టేట్ మాత్రం కాస్త నమ్మేలానే ఉంది. ఎస్ఎస్ఎంబీ 29ని ఈ ఏడాది జూన్, జూలైలో గ్రాండ్‌గా మొదలు పెట్టబోతున్నారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. కానీ సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా.. లాంచ్ అవనుందని తెలుస్తోంది. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే ఉంది. దాంతో అదే రోజు రాజమౌళి నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడం పక్కా అంటున్నారు. గతంలో మహేష్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని కొత్త సినిమాల అనౌన్స్మెంట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎలాగు.. రాజమౌళి స్క్రిప్టు ఆగష్టు వరకు రెడీ అవుతుంది కాబట్టి.. కొబ్బరికాయ కొట్టేలానే ఉన్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.