'Mahesh-Rajamouli' : ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ముదులిపేశారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి జక్కన్న నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది.
ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ముదులిపేశారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి జక్కన్న నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. ఇప్పటికే మహేష్ బాబుతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ అడ్వెంచర్ చేయబోతున్నట్టు చెప్పేశాడు రాజమౌళి. కీరవాణి కూడా హాలీవుడ్ మీడియాతో.. ఇదే చెప్పుకొచ్చారు. అలాగే ఇండియానా జోన్స్ తరహాలో.. ఫ్రాంచైజ్ ప్లానింగ్‌లో కూడా ఉన్నాడు జక్కన్న. ఇక మహేష్ సినిమా జానర్ ఏంటో చెప్పేశాడు కాబట్టి.. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆస్కార్‌తో రాజమౌళి రేంజ్ హాలీవుడ్ లెవల్‌కి వెళ్లిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మహేష్ సినిమాను ఆస్కార్ దృష్టిలో పెట్టుకొని చేస్తాడనడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అలా చేయాలంటే.. భారీ బడ్జెట్ అవసరం. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం దాదాపు 550 కోట్లు ఖర్చు చేశారు. కానీ మహేష్ ప్రాజెక్ట్ అలా కాదు.. ఆస్కార్ క్రేజ్‌తో రాబోతోంది. అందుకే దాదాపుగా ఎనిమిది వందల కోట్ల బడ్జెట్‌తో మహేష్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. టాలీవుడ్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు.. ఈజీగా వెయ్యి కోట్ల బడ్జెట్‌ను క్రాస్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాను హాలీవుడ్ టార్గెట్‌గా చేయబోతున్నాడు కాబట్టి.. బడ్జెట్ అన్‌లిమిటేడ్ అని చెప్పొచ్చు. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. రాజమౌళి చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.