Mahesh-Rajamouli : ఇక మహేష్ ఫ్యాన్స్‌కు తట్టుకోవడం కష్టమే!
Mahesh-Rajamouli : ఇక పై మహేష్ బాబు ఫ్యాన్స్ తాకిడిని సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమేనా అంటే.. ఔననే చెప్పొచ్చు. మామూలుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.. అలాంటిది ఆర్ఆర్ఆర్ అవార్డ్ కొట్టేస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక పై మహేష్ బాబు ఫ్యాన్స్ తాకిడిని సోషల్ మీడియా తట్టుకోవడం కష్టమేనా అంటే.. ఔననే చెప్పొచ్చు. మామూలుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.. అలాంటిది ఆర్ఆర్ఆర్ అవార్డ్ కొట్టేస్తే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రజెంట్ ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్సే కాదు.. మహేష్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నెక్స్ట్ మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నాడు రాజమౌళి. జస్ట్ గ్లోబ్ ట్రాటింగ్ అన్నప్పుడే.. ఘట్టమనేని అభిమానులు ఊగిపోయారు. ఇక ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్‌ను టచ్ చేసేశాడు రాజమౌళి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటుకు ఆస్కార్ వరించింది. ఎప్పుడైటే ఈ అవార్డ్స్ ప్రకటించారో.. వెంటనే మహేష్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చేశారు అభిమానులు. #SSMB29, #Maheshbabu హ్యాష్ ట్యాగ్‌లతో రాజమౌళి సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ ఇక గ్లోబల్ స్టార్.. నెక్స్ట్ నువ్వే అన్నా.. నెక్స్ట్ ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫిల్మ్.. బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి.. బెస్ట్ యాక్టర్ మహేష్.. అంటూ సందడి చేస్తున్నారు. ఒక తుఫాన్ ఖతం, ఇంకోటి మొదలవబోతోంది.. రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.. సినిమా అనౌన్స్మెంట్కి మోత మోగిపోవాల్సిందే.. ఇంకొన్ని నెలలు ఓపిక పట్టండని ట్రెండ్ చేస్తున్నారు. అన్నట్టుగానే ఆగస్టులో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడే ఇలా ఉంటే.. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు, రిలీజ్ అయిప్పుడు.. మహేష్ ఫ్యాన్స్‌ను నిజంగానే తట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.