Mahesh-Rajamouli : అప్పటి నుంచి ‘మహేష్-రాజమౌళి’ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్!
Mahesh-Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి సినిమాకు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమాలో కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్‌ను కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా పై రాజమౌళి ఎప్పటి నుంచి సీరియస్ ఫోకస్ చేయబోతున్నాడనేది తెలియడం లేదు. ఎందుకంటే.. మార్చిలో ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం ఉంది. ఈసారి ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని కోసం మరోసారి ఫారిన్ ట్రిప్ వేయనున్నాడు జక్కన్న. ఆ తర్వాతే మహేష్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నాడు. లేటెస్ట్ అప్టేడ్ ప్రకారం.. ఏప్రిల్ నుంచి మహేష సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నాడట రాజమౌళి. స్టార్ క్యాస్టింగ్‌తో పాటు అన్ని విషయాలపై ఏప్రిల్‌లోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి.. ఆగష్టులో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. ఎలాగు అప్పటి వరకు మహేష్ చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ జక్కన్నతో కలిసి వరల్డ్ టూర్ వేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ బాబు. ఒక్కసారి రాజమౌళితో కమిట్ అయితే.. రెండు, మూడేళ్లు డేట్స్ ఇవ్వాల్సిందే. పైగా ఈ సినిమాను ప్రాంచైజీలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాబట్టి ఎస్ఎస్ఎంబీ 29 రావడానికి ఖచ్చితంగా చాలా సమయం పడుతుందని చెప్పొచ్చు.