మహేష్, రాజమౌళి కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆర్ఆర్ఆర్తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. అందుకే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ఫలానా టైంలో ఎస్ఎస్ఎంబీ 29 గ్రాండ్‌గా లాంచ్ కానుందని ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. జూన్ చివర్లో లేదా జూలైలో ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్‌గా లాంచ్ చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం అక్టోబర్ తర్వాత స్టార్ట్ చేయనున్నారట. మధ్యలో జక్కన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు. మహేష్‌కు కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కాస్త టైం కావాలి. అయితే ఈ లోపు మహేష్.. ఎస్ఎస్ఎంబీ 28ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు త్రివిక్రమ్. ఆగష్టు 11న లేదా దసరాకు రిలీజ్ ప్లానింగ్‌లో ఉన్నారు. కాబట్టి.. జూన్, జూలైలో రాజమౌళి ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అన్ని అనుకున్నట్టు జదిరితే ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2025లో రిలీజ్ ఉంటుందని అంటున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ.. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రజెంట్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. మరి జక్కన్న ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.