ఐపీఎల్ 2023(ipl 2023) 63వ మ్యాచులో భాగంగా నిన్న (మే 16న) జరిగిన ఆటలో లక్నో సూపర్ జెయింట్స్(LSG), ముంబై ఇండియన్స్(MI)ను 5 పరుగుల తేడాతో ఓడించింది. లక్నోలోని ఎర్ర నేల పిచ్‌పై మొత్తం 177 పరుగులు చేసి కృనాల్ పాండ్యా జట్టు.. రోహిత్ టీంను డిఫెండింగ్ చేసింది. దీంతో LSG కీలకమైన 2 పాయింట్లను కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో ముంబైని వెనక్కి నెట్టిసింది. ఈ క్రమంలో లక్నో 3వ స్థానానికి చేరగా..ముంబై నాలుగవ స్థానంలో ఉంది.
ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు..ఆట ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా, స్టోయినిస్ స్టాండ్ అయ్యారు. ఆ నేపథ్యంలో పాండ్యా 49, మార్కస్ స్టోయినిస్ 89 రన్స్ చేసి మొత్తంగా లక్నో 177 రన్స్ చేసి..ముంబైకి 178 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
ఇక తర్వాత ఆటకు దిగిన రోహిత్ సేనలో..ఇషాన్ కిషన్(59), రోహిత్ శర్మ (37), టిమ్ డేవిడ్(32) మాత్రమే కీలక స్కోర్లు చేశారు. మరోవైపు ముంబై ఆటగాళ్లు టార్గెట్ రీచ్ కాకుండా ఉండేందుకు లక్నో బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. చివరి ఓవర్లో ముంబై జట్టుకు 11 పరుగులు రావాల్సి ఉండగా..కేవలం ఐదు రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ గెలుపులో లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. మరోవైపు రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్ కూడా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ గేమ్‌కు ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ 12 గేమ్‌లు ఆడాయి. ముంబై 12 గేమ్‌లలో 7 గెలిచింది, లక్నో 6 గెలిచింది. దీన్ని కూడా లెక్కిస్తే, లక్నో ఇప్పుడు 13 మ్యాచ్‌లలో 7 గెలిచింది.