బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి అన్నారు. రఘునందన్ మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని చెప్పారు. దేశం కడుపు నిమో స్థాయికి తెలంగాణ చేరుకున్నది అన్నారు. తెలంగాణలో కరెంట్ ఇబ్బంది లేదని, తాగునీరు సమస్య లేదని.. సంక్షేమానికి కొదువ లేదు అన్నారు. తెలంగాణతి కెసిఆర్ కు ఉన్న అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు అన్నారు. అందరూ చెప్పినట్లు మాది కుటుంబ పాలన అని, తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే అని కొత్త అర్థం చెప్పారు.