ఫస్ట్ సినిమా ఉప్పెనతో సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఆ సినిమాతో టాలీవుడ్లో హాట్ కేక్‌లా మారిపోయింది. అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది. కానీ రీసెంట్గా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ మధ్య కృతి శెట్టిపై కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో ప్లీజ్.. అలా చేయొద్దని చెబుతోంది బేబమ్మ.
ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కృతి(Krithi Shetty)కెరీర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. హ్యాట్రిక్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్గా వచ్చిన నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమా కూడా కృతిని ఏ మాత్రం కాపాడలేకపోయింది. దీంతో కృతి శెట్టికి ఇక ఆఫర్లు రావడం కష్టమే అనుకున్నారు. కానీ ఏకంగా కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్‌తో ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. వెంకట్ ప్రభుతో ఓ సినిమా అనౌన్స్ చేశాడు విజయ్. ఈ సినిమాలోనే కృతికి ఛాన్స్ దక్కినట్టు టాక్. అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ తాజాగా తమిళ్లో మరో ఛాన్స్ అందుకుంది అమ్మడు. జయం రవితో కలిసి ఓ సినిమాకు సైన్ చేసింది.
తాజాగా సినిమా పూజ కార్యక్రమాల్లో పాల్గొంది కృతి. అలాగే తన పై వస్తున్న రూమర్స్(rumors)కు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మధ్య ఓ టాలీవుడ్ సెలబ్రిటీ కృతి శెట్టిని ఏడిపిస్తున్నాడని, కృతి శెట్టి చుట్టూ తిరుగుతున్నాడని.. జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు కృతిని వేధిస్తున్నాడని, భయపెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాడని.. ఈ మధ్యన ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కృతి ఈ విషయంలో బాధపడిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేసిందట కృతి. దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దు.. తప్పుగా ప్రచారం చెయ్యొద్దు.. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను.. నేను ఎక్కడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు.. అంటూ కృతి శెట్టి చెప్పింది. దీంతో కృతి ఎవరి గురించి ఏం చెప్పలేదని.. ఇదంతా కేవలం పుకార్లేనని క్లారిటీ వచ్చేసినట్టే.