»Kondapur Road Closed For 3 Months May 13th To August 10th 2023
Kondapur road: 3 నెలలు కొండాపూర్ రోడ్డు బంద్
మీరు హైదరాబాద్ కొండపూర్ వాసులా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు(Kondapur road) వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. ఈ మళ్లింపులు మే 13 నుంచి ఆగస్టు 10 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
హైదరాబాద్ కొండపూర్(Kondapur)వాసులకు మరో బ్యాడ్ న్యూస్. అది ఏంటంటే నగరంలోని ప్రధాన ప్రాంతంలో మూడు నెలలు పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి మూడు నెలల పాటు ఈ రహదారి(road)ని మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణనాయక్ వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
గచ్చిబౌలి ఓఆర్ఆర్ కూడలి నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని కొద్ది రోజులుగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 13 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ రహదారిలో ఎలాంటి వాహనాలు అమతించమని ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు(traffic police) తెలిపారు.
గచ్చిబౌలి ఓఆర్ఆర్(ORR) కూడలి నుంచి కొండాపూర్ వెళ్లే రహదారి వద్ద 24 గంటలూ పని జరుగుతుందని చెప్పారు. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని వాహదారులను కోరారు.