ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే, గేమ్ ఛేంజర్ తప్ప మరే తెలుగు చిత్రానికి సంతకం చేయలేదని కియారా అద్వానీ(Kiara Advani) వారిని నిరాశపరిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2లో తాను భాగమని, అయితే తాను ఎన్టీఆర్ ప్రేమికురాలిగా నటించడం లేదని ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ అభిమానులకు కైరా అద్వానీ షాక్(Kiara Advani) ఇచ్చింది. కియారా అద్వానీ బాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా కొనసాగుతుంది. తన తదుపరి చిత్రం MS.ధోని ది అన్‌టోల్డ్ స్టోరీతో అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత కియారా భరత్ అనే నేనులో మహేష్ బాబుతో నటించి టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంటనే ఆమె వినయ విధేయ రామలో రామ్ చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. మళ్లీ తెలుగులో కనపడలేదు. అప్పటి నుంచి బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఆమె ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేస్తోంది.
అయితే ఆ మధ్య ఓ తెలుగు సినిమాలో ఎన్టీఆర్‌తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుందని పుకార్లు వ్యాపించాయి. ఈ వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే గేమ్ ఛేంజర్ తప్ప మరే తెలుగు చిత్రానికి సంతకం చేయలేదని కియారా అద్వానీ వారిని నిరాశపరిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ 2లో తాను భాగమని, అయితే తాను ఎన్టీఆర్ ప్రేమికురాలిగా నటించడం లేదని ఆమె తెలిపింది. తాను ఎన్టీఆర్(NTR) లవ్ ఇంట్రెస్ట్ గా చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చింది.