»Key Evidence Available In Pravalika Case Sections 417 420 306 Registered Against Shivaram
Pravalika కేసులో కీలక ఆధారాలు లభ్యం..శివరాంపై 417, 420, 306 సెక్షన్లు నమోదు
ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామే నిందితుడని పోలీసులు గుర్తించారు. తమకు లభించిన విలువైన ఆధారాల మేరకు శివరాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో నిందితుడు శివరాంపై చిక్కడపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ప్రవళికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు పలు విలువైన ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. దీంతో శివరాంపై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, పోలీసులు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తున్నట్లు తెలియజేశారు.
ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్ నగర్లోని ఓ వసతి గృహంలో ప్రవళిక ఉంటోంది. స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్లో ప్రవళిక శిక్షణ తీసుకుంటోంది. గత శుక్రవారం ఆమె హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా కాంగ్రెస్ ఆరోపణలు చేయడమే కాకుండా ర్యాలీలు, ధర్నాలు కూడా నిర్వహించి కేసును పక్కదారి పట్టించింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శివరాం అనే యువకుడు మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు విచారణలో తేలడంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.