»Investor Wealth Increased By Rs 7 90 Lakh Crore In Five Days
Stock Market: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు..5 రోజుల్లోనే 8 లక్షల కోట్ల సంపద వృద్ధి
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేయడం కూడా మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్‌లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి.
Stock market in huge gains Sensex 872 points plus december 14th 2023
Stock Market: బిఎస్ఇ సెన్సెక్స్ 274 పాయింట్లు ఎగబాకి 65,479.05 వద్ద సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్లు మంగళవారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో ర్యాలీని కొనసాగించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేయడం కూడా మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్‌లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి.
30-షేర్ల సెన్సెక్స్ 274 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 65,479.05 పాయింట్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఒక దశలో 467.92 పాయింట్లు పెరిగి 65,672.97 రికార్డు స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 66.45 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 19,389 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఒకానొక దశలో ఇది 111.6 పాయింట్ల లాభంతో 19,434.15 పాయింట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్ 7.71 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతో పాటు బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టైటాన్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీలు ఊపందుకున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. ఇతర ఆసియా మార్కెట్లలో చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ లాభపడగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్‌కు చెందిన నిక్కీ నష్టాల్లో ఉన్నాయి.
ఐరోపాలోని ప్రధాన మార్కెట్లు ప్రారంభ ట్రేడ్‌లో మిశ్రమ ధోరణిని కనబరిచాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.15 శాతం పెరిగి 75.51 డాలర్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.1,995.92 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జూన్ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పిఐలు రూ.47,148 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 10 నెలల FPI పెట్టుబడిలో ఇదే అత్యధికం. స్టాక్ మార్కెట్లో గత ఐదు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7,90,235.84 కోట్లు పెరిగి రికార్డు స్థాయిలో రూ.2,98,57,649.38 కోట్లకు చేరుకుంది.