»If There Is A Star On Rs 500 Is It A Fake Note Rbi Clarity
RBI: రూ.500పై స్టార్ గుర్తు ఉంటే ఫేక్ నోటా? ఆర్బీఐ క్లారిటీ
రూ.500పై స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవని ఇటీవలె విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ స్పందించింది. ఆ ప్రచారం నమ్మొద్దని దానిపై ఓ క్లారిటీ ఇచ్చింది.
ఈ మధ్యకాలంలో నకిలీల(Fakes) హవా ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా నకిలీ కరెన్సీ నోట్లు(Fake Notes) చెలామణి అవుతున్నాయి. వాటిని కట్టడిచేయడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నిందితులను పట్టుకుని శిక్ష విధించినా మరికొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే తాజాగా కరెన్సీ నోట్లపై స్టార్ (*) అనే గుర్తు (Star Symbol) ఉంటే నకిలీ నోటు అనే చర్చ మొదలైంది.
దీనిపై సోషల్ మీడియా వేదికగా అనేక చర్చలు సాగుతున్నాయి. నకిలీ నోట్ల(Fake Notes)పై వస్తున్న అనుమానాలపై కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్లారిటీనిచ్చింది. కరెన్సీ నోట్లపై స్టార్ (*) గుర్తు ఉన్న నోట్లు (Star Symbol) కూడా ఇతర నోట్లతో సమానంగా చట్టబద్ధమైనవేనని వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రకటన కూడా చేసింది.
సాధారణంగా కరెన్సీ నోట్ల(Corrency Notes)పై సీరియల్ నెంబర్ ను ముద్రిస్తుండటం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని నోట్లపై స్టార్ సింబల్ (Star Symbol)ను ముద్రించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రీఫిక్స్, సీరియల్ నెంబర్ మధ్య ఈ స్టార్ గుర్తు ఉంటుందని ప్రకటించింది. స్టార్ సింబల్ ఉన్న నోట్లు నకిలీవి కావదని, పునర్ ముద్రించిన నోట్లు అని ఆర్బీఐ స్పష్టతనిస్తూ ప్రకటన చేసింది. గతంలో 2016లో కూడా ఆర్బీఐ జారీ చేసిన రూ.500 నోట్లపై కూడా స్టార్ సింబల్ ఉన్నట్లు ఆర్బీఐ గుర్తు చేసింది.