టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో సొమ్మసిల్లిపడిపోయిన నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉంది. నందమూరి కుటుంబసభ్యులంతా తారకరత్న ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం మెరుగు పడాలని కుటుంబసభ్యులే కాకుండా నందమూరి అభిమానులు కోరుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే తన సోదరుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హీరో కల్యాణ్ రామ్ తన సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తారకరత్న వెంటనే కోరుకోవాలని ట్వీట్ చేశాడు.
నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను .
Get well soon and get back to complete health brother.
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్ రామ్, గిబ్రాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అమిగోస్’. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాలోని పాటలను వరుసగా విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని మరో పాటను ఈనెల 29న విడుదల చేయాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాట విడుదలను వాయిదా వేశారు. ‘ఎన్నో రాత్రులు వస్తాయి’ అనే పాట ప్రొమోను ఇప్పటికే విడుదల చేయగా.. పూర్తి పాటను విడుదల చేయాల్సి ఉంది. సోమవారం విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.
ఇక తన సోదరుడి ఆరోగ్యంపై కల్యాణ్ రామ్ ఆవేదన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. ‘నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రా సోదరా’ అని కల్యాణ్ రామ్ ట్విటర్ లో పోస్టు చేశాడు. నందమూరి అభిమానులు కూడా తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.