నారా లోకేష్ పాదయాత్రలో కోడిగుడ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమకు సెల్పీ ఇవ్వనందుకే కోడిగుడ్ల దాడి చేసినట్లు నిందితులు తెలిపారు.
టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Paadayatra) చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నారా లోకేష్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రొద్దుటూరులో కోడిగుడ్ల దాడి చేశారు. లోకేష్ పాదయాత్ర చేస్తుండగా ఆయనపై విసిరిన కోడిగుడ్లు..భద్రతా సిబ్బందికి తగిలాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు(police case) చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పెన్నా నగర్‌కు చెందిన బాబు(Babu), శ్రీకాంత్(Srikanth) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ (Nara Lokesh)పై వీరు కోడిగుడ్ల దాడి చేసినట్లు నిర్దారించారు. దీనిపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్(ASP Prerana kumar) మాట్లాడుతూ.జూన్ 1వ తేదిన నారా లోకేష్ (Nara Lokesh)పై ప్రొద్దుటూరులో కోడిగుడ్ల దాడి జరిగిందని తెలిపారు.
ఆ సమయంలో నిందితులు బాబు, శ్రీకాంత్ కోడిగుడ్లు విసినట్లు ఒప్పుకున్నారన్నారు. నిందితులు ఇద్దరూ కూడా స్నేహితులని, లోకేష్ సెల్ఫీ ఇవ్వలేదనే కోపంతో వారు కోడిగుడ్లు విసిరినట్లు తెలిపారు. ఇద్దరూ మాట్లాడుకుని మరీ కోడిగుడ్లను లోకేష్ (Nara Lokesh)పైకి విసిరినట్లుగా ఏఎస్పీ వివరించారు.