CTR: పులిచెర్ల మండలం మతుకువారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అయితే శనివారం ఉదయం పాతపేటకు చెందిన చలపతి(36) తిరుమలకు గ్రామస్థులతో కలిసి ట్రాక్టర్లో వెళ్లే క్రమంలో కల్లూరులో ట్రాక్టర్ కింద ప్రమాదవశాత్తు పడటంతో వెంటనే పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చలపతి మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు SI ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.