»Early Availability Of Itr Forms To Enable Return Filing From April 1
ITR: ఏప్రిల్ 1 నుండి ఐటీ రిటర్న్స్
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్‌ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది. 2023-24 అసెస్మెంట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రారంభం రోజు నుండే సంబంధిత ఫామ్స్ అందుబాటులో ఉంటాయని సీబీడీటీ పేర్కొంది. గత ఏడాది ఐటీఆర్ పత్రాలతో పోలిస్తే ఈ ఏడాది పెద్దగా మార్పులు లేనందున, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చునని స్పష్టం చేసింది. వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన ఐటీ ఫామ్స్ సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. అసెస్మెంట్ ఇయర్ ప్రారంభం నుండి రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం ఉంటుంది. జూలై 31 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సమయం ఉంటుంది.
తాజా బడ్జెట్లో ఆదాయపు పన్ను (Income tax) పరిమితిని రూ.7 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని కొత్త పన్ను విధానంలో రూ.5 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. కొత్త పన్ను విధానం ఇకపై డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని తెలిపారు. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్‌ల సంఖ్యను కూడా తగ్గించారు. మొత్తం 6 స్లాబ్స్ ఉండగా 5 చేశారు. రూ.3 లక్షల లోపు ఎలాంటి పన్నులు ఉండవు. రూ.3 నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే 30 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గానే ఉంటుందని, పౌరులు పాత పన్ను విధానాన్ని కూడా ఎంచుకునేందుకు ఆప్షన్ ఉంటుందని బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు.