ప్రకృతిని నాశనం చేసే వాటిలో ముందుంటుంది కాలుష్యం. అందులో వాయు కాలుష్యం ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇందులో చాలా కారణాలు ఉన్నా ముఖ్యంగా వాహనాల వలన అధికంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఆ తర్వాతే ఫ్యాక్టరీలు చేసే కాలుష్యం పరిగనలోకి వస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో వాయుకాలుష్యం ఎలా ఉందో తెలిసిన విషయమే. ప్రపంచానికి నష్టం కలిగించని వాటిలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళన చెందాల్సిన విషయమే. అలాంటి స్థితిని ఎలక్ట్రిక్ వాహనాలే మార్చనున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలనుంచి కాలుష్యం వచ్చేది శూన్యం.
ప్రస్తుతం… వాహనాలు చేసే కాలుష్యానికి విరుగుడును కనుగొన్నారు. విజయ్ అనే వ్యక్తి ఓ మైలేజ్ బూస్టర్ ఇంజక్షన్ ను కనుగొన్నారు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల మైలేజ్ పెరుగుతుందని తెలుస్తోంది. వాహనాల ద్వారా విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ ను ఈ ఇంజక్షన్ తో ఆక్సీజన్ గా మార్చవచ్చని విజయ్ తెలిపారు. డీఆర్డీఓ ద్వారా ఆమోదం పొందిన Drive Nine Mileage Booster ను అన్ని రకాల వాహనాలలో వినియోగించవచ్చని తెలిపారు.
అయితే.. విమానాలు, క్షిపణులు, జలాంతర్గాములు, యుద్దట్యాంకులు లాంటి వాటిలో కూడా ఈ ఇంజక్షన్ పనిచేస్తుందన్నారు విజయ్. ఇప్పటికే స్కూటర్స్, బైక్లు, కార్లు, ట్రక్స్ లలో ఈ ఇంజక్షన్ ను ఇంజక్ట్ చేసినట్లు చెప్పారు. దీని వలన మైలేజ్ పెరుగుతందని, పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని, పికప్, స్యూత్ నెస్, వైబ్రేషన్స్ తగ్గుతాయని ఏసీ కూడా చాలా బాగా వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే 13 లక్షలకు పైగా వెహికిల్స్ లో ఇంజక్ట్ చేసినట్లు తెలిపారు. పెట్రోల్ వెహికిల్స్ కు 30 – 40 శాతం, డిజిల్ వెహికిల్స్ కు అయితే 40 – 50 శాతం మైలేజ్ అదనంగా వస్తుందని అన్నారు.