తెలుగుతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో ఒకనాడు ఓ వెలుగు వెలిగిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma). అతడు ప్రస్తుతానికి సినిమాలకు (Movies) దూరంగా ఉండి వివాదాలకు దగ్గరగా ఉంటున్నాడు. చిత్రవిచిత్ర ట్వీట్లతో ఎప్పుడూ సోషల్ మీడియాలో (Social Media) యాక్టీవ్ గా ఉంటాడు. కాగా తన పుట్టిన రోజు (Birthday) విషయమై ఆర్జీవీ (RGV) ట్వీట్ వైరల్ గా మారింది. ‘రేపు నా పుట్టినరోజు ఎవరూ శుభాకాంక్షలు చెప్పొద్దు’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు.
ఆర్జీవీ ఏప్రిల్ 7, 1962లో జన్మించాడు. షష్టిపూర్తి చేసుకున్న ఆర్జీవీ శుక్రవారంతో ఆయన 61వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. అయితే తన జన్మదినాన్ని ఆర్జీవీ గురువారం గుర్తు చేశాడు. ‘రేపు నా పుట్టినరోజు. దయచేసి నాకు ఎవరూ శుభాకాంక్షలు (Wishes) చెప్పవద్దు. శుభాకాంక్షలు అనేవి ఉచితంగా చేసేవి. అవి పనికి రానివి. శుభాకాంక్షలు కాకుండా చవకైన బహుమతులతో (Cheap Gifts) నేను సరిపెట్టుకుంటా. ఉచితం కంటే చవక ఉత్తమం’ అని ట్వీట్ చేశాడు. కాగా 2022లో కూడా ఇలాంటి ప్రకటనే చేసి కొత్త దుస్తులు వేసుకున్న ఫొటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. వర్మ పుట్టినరోజు, వర్ధంతులు, కొత్త సంవత్సరం, లవర్స్ డే వంటివి పట్టించుకోడు. ఏది ఉన్నా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతాడు. అదే అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ హల్ చల్ చేస్తుంటాడు.
ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో (Acharya Nagarjuna University) పర్యటించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 37 ఏళ్ల తర్వాత వర్మ తన డిగ్రీకి సంబంధించిన సర్టిఫికెట్ పొందాడు. అతడు గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీర్ చదివాడు. అత్తెసరు మార్కులతో ఆర్జీవీ ఉత్తీర్ణత సాధించాడు. కాగా ఇటీవల తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై వర్మ దాదాపు 10 -15 రోజుల పాటు వరుస ట్వీట్లు చేశాడు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద పోస్టులు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ సినిమాల విషయాలు తెలియడం లేదు. ఆయన సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.
Tmrw the 7 th is my happy birthday..Please don’t wish me ..That’s because wishes are free and useless ..I am ok with cheap gifts ..CHEAP is better than FREE