»Dcb Bank Hikes Savings Account Fixed Deposit Interest Rates
Fixed Deposit: ఆ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు..వడ్డీ రేట్లు పెంపు
ప్రైవేటు బ్యాంకు అయిన డీసీబీ బ్యాంక్(DCB Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు చెప్పింది. డీసీబీ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్(Saving Accounts), ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposites)పై వడ్డీ రేట్లను డీసీబీ బ్యాంక్ పెంచింది. దీంతో బ్యాంకు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు డిపాజిట్లపై అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చని కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్యాంకు రూ.2 కోట్లకు లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

బ్యాంకు సేవింగ్ అకౌంట్ల(Bank Saving Accounts)పై గరిష్టంగా 8 శాతం వడ్డీని డీసీబీ బ్యాంకు(DCB Bank) అందిస్తోంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో రెగ్యులర్ కస్టమర్లకు 8 శాతం వరకూ, సీనియర్ సిటిజన్స్ కు 8.5 శాతం వరకూ వడ్డీ లభించనుంది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది.
రూ.లక్ష వరకూ బ్యాలెన్స్ ఉండే అకౌంట్లపై వడ్డీ రేటు అనేది 2.25 శాతంగా ఉంది. అదేవిధంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 4 శాతంగా ఉంటుందని బ్యాంకు(DCB Bank) తెలిపింది. అలాగే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వడ్డీరేటు 5 శాతంగా ఉంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ బ్యాలెన్స్ పై వడ్డీ రేటు 6 శాతంగా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకూ బ్యాలెన్స్ ఉంటే 7.25 శాతంగా వడ్డీ రేటు ఉంది.
ఇకపోతే ఎఫ్డీ రేట్ల(Fixed Rates) విషయానికి వస్తే 15 నెలల నుంచి 24 నెలల వరకూ టెన్యూర్లోని డిపాజిట్లపై వడ్డీ రేటు 8 శాతంగా లభిస్తున్నట్లు డీసీబీ బ్యాంకు(DCB Bank) తెలిపింది. రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని, సీనియర్ సిటిజన్స్ కు అయితే 8.5 శాతం వడ్డీ లభిస్తున్నట్లు డీసీబీ బ్యాంకు(DCB Bank) వెల్లడించింది.