సూడాన్(Sudan)లో అంతర్యుద్ధం జరుగుతోంది. సైన్యం(Army), పారామిలిటరీ(Paramilitary) బలగాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణల్లో చనిపోయిన(Died) వారి సంఖ్య 413కి చేరినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. రెండు బలగాల మధ్య ఘర్షణల కారణంగా 3500 మందికి పైగా గాయాలపాలైనట్లు డబ్బ్యూహెచ్ఓ తెలిపింది.
నేడు ఈద్ ప్రార్థనల సమయంలో కూడా సైన్యం(Army), పారామిలిటరీ(Paramilitary) బలగాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘర్షణల కారణంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో సూడాన్(Sudan)లోని తమ దేశాలకు చెందిన పౌరులను స్వదేశాలకు రమ్మంటూ వివిధ దేశాలు ఆదేశాలిచ్చాయి.