»Breaking Renudesais Leg Is Injured Three Fingers Are Broken
Breaking: రేణుదేశాయ్ కాలికి గాయం..చితికిపోయిన మూడు వేళ్లు!
రేణు దేశాయ్ కు గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. తన కాలులో మూడు వేళ్లు చితికిపోయానని, కోలుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో విడాకులు తీసుకున్నాక రేణు దేశాయ్(Renu Desai) దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ తన పిల్లల్ని చూసుకుంటోంది. ఈ మధ్యనే తన యాక్టింగ్ కెరీర్ను మళ్లీ మొదలుపెట్టింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా(Tiger Nageswararao Movie)తో ఆమె ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ తన విషయాలను, తన పిల్లల విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. పవన్ వారసుడు అయిన అకీరా నందన్(Akira Nandan)కు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది.
తాజాగా రేణు దేశాయ్(Renu Desai) తనకు గాయం అయినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. రెండు రోజులకు ముందు తన కాలుకు గాయం అయ్యిందని, దానివల్ల తన మూడు వేళ్లు చితికిపోయినట్లు ఆమె ఆ పోస్టులో తెలిపింది. గాయం అయిన కాలుతో నడుచుకుంటూ ఆమె సముంద్రంలోకి వెళ్తున్న వీడియోను షేర్ చేయడంతో అదికాస్తా నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
ఆమె పోస్ట్ చూసిన కొందరు ఫాలోవర్స్ ఆమెకు జాగ్రత్తలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. కాగా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం(Tiger Nageswararao Movie)లో రేణు దేశాయ్(Renu Desai) కీలక పాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు వంశీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీఎంట్రీ తర్వాత రేణు దేశాయ్ ఎలా కనిపించనుందోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంంది. అక్టోబర్ 20న ఈ మూవీని విడుదల చేయనున్నారు.