»Allu Aravind Indirect Comments On Jeevitha Rajasekhar At Bhola Shankar Movie Pre Release Event
Allu Aravind: వారిని జైలుకు పంపడానికి 12 ఏళ్ల పోరాటం
టాలీవుడ్లో మెగా వివాదం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ మధ్యే ఉందని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు రాజశేఖర్, చిరంజీవి మధ్య ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంటుంది. రాజకీయమా? వ్యక్తి గత కారణమా? తెలియదు గానీ.. జీవిత, రాజశేఖర్ దంపతులను జైలుకి పంపించడానికి 12 ఏళ్లు పోరాటం చేశానని.. ఇండైరెక్ట్‌గా అల్లు అరవింద్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా అయింది.
ఆగష్టు 11న మెగాస్టార్(chiranjeevi) లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో.. ఆదివారం రోజు భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాభిమానుల మధ్య హైదరాబాద్(hyderabad) శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది భోళా శంకర్ వేడుక. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అటెండ్ అయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. చిరంజీవి పై తనకున్న అభిమానం ఎలా ఉంటుందో అని చెబుతూ.. ఇండైరెక్ట్‌గా జీవిత, రాజశేఖర్ జైలు వ్యవహారంలా ఉంటుందని చెప్పాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చూడని సక్సెస్ ఉందా.. మీరంతా ఆయన సినిమాలు చూసి పెరిగితే.. నేను చేస్తూ పెరిగాను.. నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తాను. ఎంత అభిమానిస్తాను అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఆయన చేసే సేవలను, కార్యక్రమాలను ఒకళ్లు నీచంగా మాట్లాడారని.. పన్నెండేళ్లు పోరాటం చేసి జైలుకెళ్లే వరకు ఊరుకోలేదు’.. అది చిరుపై తనకున్న ప్రేమ అన్నట్టుగా అల్లు అరవింద్(Allu Aravind) చెప్పుకొచ్చాడు. ఇక్కడ రాజశేఖర్, జీవితల(Jeevitha Rajasekhar) పేర్లు చెప్పకపోయినా.. ఇటీవలె వీళ్లకు జైలు శిక్షతో పాటు జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ పరోక్షంగా.. మెగాస్టార్ పై తన అభిమానాన్ని చాటుతూ గుర్తు చేశాడు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన కొత్తలో జీవిత, రాజశేఖర్ కొన్ని అనరాని మాటలు అన్నారు. చిరు బ్లడ్ బ్యాంక్ మీద కూడా ఆరోపణలు, విమర్శలు చేశారు. దాంతో అల్లు అరవింద్, జీవిత రాజశేఖర్లపై పరువు నష్టం కేసు వేశాడు. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత జీవిత, రాజశేఖర్ దంపతులకి జైలు శిక్ష విధించింది కోర్టు. ఏదేమైనా.. తన బావ అంటే అల్లు అరవింద్‌కు ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అని చెప్పొచ్చు.