»Air Pollution Has Reached A Dangerous Level In Thailand 13 Lakh People Are Sick
అమ్మో వాయుకాలుష్యం..13 లక్షల మందికి అస్వస్థత
ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం(Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకూ విపరీతమైన కాలుష్యం(Pollution) పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. థాయ్లాండ్ లో అయితే వారం రోజుల్లో వాయుకాలుష్యం మరింత ప్రమాదకరంగా తయారైంది. దీంతో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురవ్వగా 2 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారని థాయ్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యాని(Air Pollution)కి సంబంధించి అత్యంత కాలుష్య నగరాల జాబితాలో బ్యాంకాక్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం థాయ్ లాండ్ లో ఈ కాలుష్యం(Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి(Air) నాణ్యత తీవ్రంగా పడిపోయింది. వాయు కాలుష్యం కారణంగా 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు.
బ్యాంకాక్ సిటీకి పర్యాటక కేంద్రంగా మంచి పేరుంది. ఇక్కడికి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులు తరలివస్తుంటారు. ఇటువంటి బ్యూటిఫుల్ సిటీలోనే వాయు కాలుష్యం(Air Pollution) తీవ్రంగా ఉండటంతో పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వస్తోన్న కాలుష్యం(Pollution)తో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో అత్యవసరమైతే తప్పా బయటకు ఎవ్వరో రావొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కచ్చితంగా మాస్కులు(Masks) వాడాలని ప్రజలకు సూచించారు. పిల్లలు, గర్భిణులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు కోరారు.