SDPT: కుకునూర్‌పల్లి మండలం మంగోల్‌లో ఈరోజు విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మంగోల్ అడ్డ రోడ్డు వద్ద గల ఓ రెడిమిక్స్ కంపెనీలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహనంద సర్దార్ పని చేస్తున్నాడు. కాగా తన పెళ్లికి తండ్రి అంగీకరించడం లేదని తీవ్ర మనస్తాపంతో విద్యుత్ స్తంభానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.