కేరళలో బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు MBBS విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 9 గం.లకు కారులో ఏడుగురు విద్యార్థులు అతి వేగంతో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహమ్మద్, ముహాసిన్, ఇబ్రహీం, దేవానంద్, శ్రీదీప్లుగా అధికారులు గుర్తించారు. ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.