ఓ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను ఓ డాక్టర్ నెట్టింట పోస్ట్ చేయగా..ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
గతంలో సోషల్ మీడియా(social media)లో నాగిని డ్యాన్స్, బెల్లి డ్యాన్స్, బుల్లెట్ బైక్ సాంగ్ డ్యాన్స్ సహా పలు వీడియో(video)లు వైరల్(viral) అయిన సంఘటనలు చుశాం. కానీ మీరు ఎప్పుడైనా నెక్ డ్యాన్స్ చుశారా? అదేంటీ అనుకుంటున్నారా. అవును ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి డోలు వాయిద్యాలకు తగినట్లుగా తన మెడను చుట్టూ గుండ్రంగా తిప్పుతుండటం వీడియోలో చూడవచ్చు. ఓ కార్యక్రమంలో భాగంగా అతను తన మెడ(neck)ను వేగంగా తిప్పుతూ డ్యాన్స్(dance) చేస్తూ ప్రదర్శించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారింది.
ఈ వైరల్ అవుతున్న వీడియోను డాక్టర్ గిల్(dr gil) అనే నేత్ర వైద్యుడు ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ 19 సెకన్ల వీడియో క్లిప్‌లో ఓ వ్యక్తి పెప్పీ సంగీతానికి వినూత్నంగా డ్యాన్స్(dance) చేస్తూ కనిపించాడు. అయితే అతను తన మొత్తం శరీరం కదిలించకుండా, కేవలం తన మెడను మాత్రమే తిప్పడం చూడవచ్చు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ వ్యక్తి నా మెడ(neck) నొప్పిగా ఉందని కామెంట్ చేయగా…ఇంకో వ్యక్తి గుడ్ల గూబ మాదిరిగా తిప్పుతున్నాడని వ్యాఖ్యనించాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్(comment) చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు కూడా చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరి.