డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల టార్గెట్ ఉంచింది. రేపు ఆడే ఆట భారత్ కు కీలకం కానుంది. భారత్ ముందు భారీ లక్ష్యం ఉండటంతో రేపు ఆటగాళ్లు మరింత శ్రమించాల్సి ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా(Team India) ముందు ఆస్ట్రేలియా(Australia) జట్టు 444 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించడంతో భారత్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. నేడు నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టు తన ఇన్నింగ్స్ ను విరమించింది. 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి ఆసీస్ డిక్లేర్ చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 443 పరుగుల ఆధిక్యం లభించింది.
ఆస్ట్రేలియా(Australia) జట్టు ఇన్నింగ్స్లో వికెట్ కీపర్, బ్యాటర్ అలెక్స్ కేరీ 66 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు నడిపాడు. మిచెల్ స్టార్క్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు భారీగా పెరగింది. స్టార్క్ 57 బంతుల్లోనే 7 ఫోర్లతో చెలరేగిపోయాడు. 41 పరుగులు చేశాడు. ఇకపోతే ఆసీస్ మిగిలిన ఆటగాళ్లు అయిన లబుషేర్ 41, స్మిత్ 34, హెడ్ 18, గ్రీన్ 25 రన్స్ చేశారు.
టీమిండియా(Team India) బౌలర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) 3 వికెట్లను పడగొట్టాడు. షమీ 2 వికెట్లు తీయగా సిరాజ్ 1, ఉమేశ్ యాద్ 2 వికెట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. టీమిండియా 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే 7.1వ ఓవర్లో శుభ్ మన్ గిల్(ShubMan Gil) 18 పరుగులు చేసి ఔటయ్యాడు. బోలాండ్ విసిరిన బంతికి గిల్ పెవిలియన్ కు చేరాడు. మరో ఓపెనర్ అయిన రోహిత్ శర్మ(Rohit Sharma) 22 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. రేపు ఆడే మ్యాచ్ భారత్ కు కీలకం కానుంది.