»The Player Labuschagne Who Slept In India Vs Australia Match
India vs Australia: మ్యాచులో పడుకున్న ఆటగాడు
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ టెస్టు మ్యాచులో భాగంగా మార్నస్ లాబుషేన్(Marnus Labuschagne) నిద్రపోతూ పట్టుబడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఓ వైపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా WTC ఫైనల్ టెస్టు మ్యాచ్ మూడో రోజు జరుగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్(Marnus Labuschagne) కాసేపు కునుకు తీశారు. రెండో ఇన్నింగ్స్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో డ్రైస్సింగ్ రూము బయట ఉన్న కుర్చిలో అతను కాసేపు నిద్రించారు. అదే క్రమంలో లబుషేన్ పై కెమెరాలు ఫోకస్ పెట్టాయి. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ఆడుతున్నారు.
వార్నర్ ఔట్ కావడంతో లబుషేన్ ఒక్కసారిగా నిద్రలోనుంచి మెల్కొని ఉలిక్కిపడి లేశాడు. ఆ తర్వాత ఇక తప్పదు అన్నట్లు బ్యాట్ పట్టుకుని ఆటకు వచ్చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. లబుషేన్ 41, గ్రీన్ 7 రన్స్ చేశారు.