నిజామాబాద్ జిల్లా(nizamabad district) చాంద్రాయణ్ పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car) అతివేగంతో కంటైనర్ లారీని(heavy lorry) వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు(car)లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
నిజామాబాద్ జిల్లా(nizamabad district) ఇందల్వాయి మండలం చాంద్రాయణ్ పల్లి శివారులో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఓ కారు(car) అతివేగంతో వెనుక నుంచి వచ్చి భారీ కంటైనర్ లారీని(heavy lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా..అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహారాష్ట్రలోని బిలోలికి ప్రాంతానికి చెందిన వారు కాగా, ఇంకొకరు నిజామాబాద్ దుబ్బ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదంపై మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు(police) సమాచారం అందించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు(family) అందజేయనున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. అది ఎలా జరిగింది? ప్రత్యక్ష సాక్షుల ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతి వేగమే(over speed) ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.