VKB: బషీరాబాద్ మండలంలో దారుణం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు, రేణుక తమ పెదనాన్న దేవప్ప పొలంలో ఇసుక తవ్వుతున్నారు. ఈ క్రమంలో కౌలు రైతు అశోక్, కృష్ణ ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. ఈ దాడిలో రేణుక గాయపడ్డారు. ఆమెను తాండూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.