TG: న్యాయవాదిపై దుండగులు కత్తితో దాడి చేసిన ఘటన HYDలోని ఖైరతాబాద్‌లో జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయవాది కళ్యాణ్‌పై దాడికి పాల్పడిన దుండగులు మొబైల్ లాక్కుని పారిపోయారు. ఈ క్రమంలో న్యాయవాది చేతికి గాయాలయ్యాయి. దీనిపై లాయర్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు, దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడే ముఠా దాడి చేసి ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.