కృష్ణా: ఆగిరిపల్లి మండలం వడ్లమాను రైతు సింహాద్రి జగన్మోహనరావు తన కుమారుని వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్ళగా, బైకు చోరీ జరిగిందని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. పెదవుటుపల్లి పిన్నమనేని ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్ళగా, పార్కింగ్ చేసిన బైక్‌ను అగంతకుడు దర్జాగా చోరీ చేసి వెళ్లిన సంఘటన సీసీ ఫుటేజ్‌లో రికార్డయిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.