కాకినాడ: అన్నవరం ఆలయ రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ సముదాయంలో మంటలు చెలరేగి ఫ్యాన్సీతో పాటు మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి. భద్రతా సిబ్బంది అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. షాట్ సర్యూట్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.