కృష్ణా: కోడూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన చింతా వెంకట్రావు (50) పాముకాటుకు గురై మృతి చెందాడు. బుధవారం చేను గట్టుపై పశువుల కోసం మేత కోస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే.చాణక్య తెలిపారు.