KMM: పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుని విద్యార్థి మృతి చెందిన ఘటన కూసుమంచి మండల పరిధిలోని, నాయక్ గూడెం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం జరిగింది. యూకేజీ చదువుతున్న విద్యార్థి మేడారపు విహార్ మధ్యాహ్న సమయంలో ఆడుకుంటుండగా జేబులో ఉన్న పెన్సిల్ ఛాతిలో గుచ్చుకుంది. దీనిని గమనించిన పాఠశాల సిబ్బంది 108 సహాయంతో హాస్పిటల్కి తరలిస్తుండగా మృతి చెందాడు.