W.G: ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.60,000 వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణం వెలిగించిన సిగరెట్‌ను అజాగ్రత్తగా పాడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు.