CTR: తవణంపల్లి మండలం కె.పట్నం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎస్సై చిరంజీవి.. నిందితులు తుపాకుల మనోహర్ (32), సామ్యూయల్ రాజ్ (34)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల బంగారు చైన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.