WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని కరీమాబాద్ రంగలీలా మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల తేదీలను ఉర్సు దసరా ఉత్సవ కమిటీ ప్రకటించింది. శుక్రవారం ఆదర్శ ట్రస్ట్ భవనంలో జరిగిన సమావేశంలో సద్దుల బతుకమ్మను సెప్టెంబర్ 30న మంగళవారం, విజయదశమి, రావణవధ ఉత్సవాలను అక్టోబర్ 2న గురువారం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.