NLR: ఉదయగిరి మండలంలోని సంజీవరాజుపల్లిలో గ్రామానికి చెందిన బీ.ఆంజనేయరాజు బ్యాంక్ ఖాతాలో నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.1,62,465 స్టేట్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.3,900 డ్రా చేసినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో అతను వెంటనే ఆయా బ్యాంక్‌కు వెళ్లి విచారించాడు. బ్యాంక్ అధికారులు తమకు తెలియదని చెప్పడంతో పోలీసులకు తెలిపాడు.